కోదండరాంపురంలో మద్యం దుకాణం ఏర్పాటుపై గ్రామ మహిళలు ఆందోళన
కోదండరాంపురంలో మద్యం దుకాణం ఏర్పాటుపై గ్రామ మహిళలు ఆందోళన
గ్రామంలోనే ధర్నా చేపట్టిన మహిళలు
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి మండలంలోని కోదండరాంపురం గ్రామంలో బ్రాహ్మణ క్రాక గ్రామలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాన్ని రాత్రికి రాత్రే కోదండరాంపురం గ్రామంలో ఏర్పాటు చేయడంతో ఆ గ్రామానికి చెందిన మహిళలు, ప్రజలు బుధవారం దుకాణం ఏర్పటు చేసిన వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను నినాదాల రూపంలో వ్యక్తపరిచారు. గత నెల రోజుల క్రితం మద్యం దుకాణం కోదండరాంపురం గ్రామంలో ఏర్పాటు చేయడానికి నిర్మాణం పనులు జరుగుతుండగా గ్రామ మహిళలు ప్రజలు అడ్డుకున్నారు. అప్పుడు జలదంకి పోలీసులు మహిళలను జలదంకి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే నిర్మాణం పనులు చేపడుతున్న వారు అక్కడ గేదెల కోసం షెడ్డు నిర్మిస్తున్నట్లు తెలపడంతో మహిళలు కూడా మిన్న కుండి పోయారు అనంతరం వారు పోలీసులు సంప్రదించగా మద్యం షాపు ఏర్పాటు చేస్తే తమకు తెలపాలని వివరించారు. ఆ క్రమంలో జరిగిన పరిణామాలు అంతటితో ముగిశాయి అయితే మంగళవారం అర్ధరాత్రి బ్రాహ్మణ క్రాకలో ఉన్న మద్యం షాపును అకస్మాత్తుగా రాత్రికిరాత్రే కోదండరాంపురం గ్రామంలో ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక మహిళలు ప్రజలు ఆందోళనకు తెర తీశారు. బరుల షెడ్డు అని చెప్పి మమ్మల్ని మోసిగించి మద్యం దుకాణం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ మద్యం దుకాణం వద్దంటూ స్థానిక ఎస్సై, తాసిల్దార్, కావలి ఆర్డిఓ, కావలి ఎక్ససైజ్ కార్యాలయం లో కలెక్టర్ కార్యాలయంలో వినతులు అందజేశాం అన్నారు. అలాగే స్థానిక ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వద్దకు వెళ్లి మా సమస్యలు విన్నవించడంతో కోదండరాంపురం గ్రామంలో మద్యం దుకాణం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు అన్నారు. మా గ్రామంలో నెలకొన్న మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకుని కోదండరాంపురం గ్రామంలో మద్యం దుకాణం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రికి రాత్రే ఏర్పడు చేసిన మద్యం దుకాణం వద్ద గ్రామస్తులు అయిన మేము ఆందోలానికి దిగామన్నారు. దీంతో స్థానిక ఎస్సై తో పాటు కావలి ఎక్సేంజ్ సిఐ శ్రీనివాసులు, కూడా మాకు న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే జలదంకి మండల పర్యటన నిమిత్తం వస్తున్న సందర్భంగా 14 మైలు వద్ద ఆయన్ను కలిసి తమ సమస్యలను ఆయనకు వివరించామని అన్నారు. ఆయన స్పందించి మాకు న్యాయం చేస్తానని తెలిపారు.