కలివెలపాలెం గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం 





నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం కలివెలపాలెం గ్రామంలో  10 లక్షల రూపాయల నిధులతో  సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ కుమార్ యాదవ్.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారం రోజులపాటు పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.  నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు,డ్రెయిన్లు మరియు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తామని అన్నారు.నెల్లూరు రూరల్ నియోజవర్గ అభివృద్దే లక్ష్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పనిచేస్తున్నారు 

 గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని విస్మరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసారు. కలివెలపాలెం గ్రామంలో అనేక సంవత్సరాల నుండి మౌలిక వసతులు లేకుండా ఉన్న స్మశానానికి, కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు మౌలిక వసతుల కల్పన కోసం 15 లక్షల రూపాయల వ్యయంతో అధికారులకు ప్రతిపాదనలను  నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి పంపించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వి.శైలేంద్ర కుమార్, నెల్లూరు రూరల్ మండల వ్యవసాయాధికారి  ఎస్.వి నాగమోహన్,   సర్పంచ్ మధు రెడ్డి, వేదగిరి లక్ష్మి  నరసింహస్వామి దేవస్థాన మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, టిడిపి నాయకులు వెడిచేర్ల వెంకటేశ్వర్లు యాదవ్ , చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పోతయ్య, శివయ్య, కామయ్య , కిషోర్ రెడ్డి, వెంకయ్య, సురేంద్ర రెడ్డి,ఈశ్వరయ్య, శ్యామయ్య, కిష్టయ్య, మల్లి , మధుబాబు, హజరతయ్య, రమణయ్య, వెంకటరామణయ్య, వెంకట శేషయ్య, శ్రీనివాసులు,  రాజేష్, మునిచంద్ర, లక్ష్మణ్, మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.