తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా  బాధ్యతలు స్వీకరించిన జరుగు విక్రమ్ కుమార్ రెడ్డి




రవి కిరణాలు, తిరుపతి, జనవరి31:-

ప్రస్తుతం జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా పని చేస్తున్న యు.చెన్నయ్య ను చిత్తూరు జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డిప్యుటేషన్ పై నియమిస్తూ అలాగే వారికి ఎస్సీ కార్పొరేషన్ కార్య నిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జి.ఓ మేరకు వారు తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారి బాధ్యతల నుండి రిలీవ్ అవగా తిరుపతి జిల్లాకు నూతన జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డైరెక్టరేట్ నుండి వచ్చిన జరుగు విక్రమ్ కుమార్ రెడ్డి నేటి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారిని కలెక్టరేట్ నందు కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి మర్యాద పూర్వకంగా కలిశారు.

అన్నమయ్య జిల్లా వాస్తువ్యులైన విక్రమ్ కుమార్ రెడ్డి 2022 గ్రూప్ - 1 అధికారిగా సెలెక్ట్ కావడం జరిగింది. వీరు జెఎన్టీయు అనంతపురం నందు బి. టెక్ ఈఈఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల సంక్షేమం మరియు అభ్యున్నతి  కొరకు తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు.