క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ను కలిసిన ఇండియా అండర్ -19 క్రికెట్ టీం వైస్ కెప్టెన్ షేక్ రషీద్. ఇండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రషీద్ ని అభినందించిన సీఎం వైఎస్ జగన్.

రషీద్ కు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు బహుమతి ప్రకటించడంతోపాటు గుంటూరులో ఇంటి స్థలం కేటాయింపు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున రూ. 10 లక్షల చెక్కును సీఎం అందజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా రషీద్ కు సీఎం హామీ ఇచ్చారు.