నెల్లూరు జిల్లా అడిషనల్ యస్పి గా వెంకటరత్నం
బుధవారం నూతన జిల్లా పోలీసు కార్యాలయం నందు నెల్లూరు జిల్లా అడిషనల్ యస్పి అడ్మిన్ గా పి.వెంకటరత్నం భాధ్యతలు స్వీకరించారు. అనంతరం యస్.బి., డిపిఓ సిబ్బంది, డి.సి.ఆర్.బి., ఎ.ఆర్., హోం గార్డ్, సి.సి.సి., సైబర్ టీం, ఐటి కోర్ టీం తదితర అన్నీ విభాగాల అధికారులు మరియు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటరత్నం 2010 బ్యాచ్ లో డియస్పి గా ఎంపికై, విజయనగరంలో డియస్పి గానూ, విశాఖపట్నం లో సిఐడి- డియస్పి గా 4 సంవత్సరాలకు పైగా పని చేసి తనదైన ముద్ర వేశారు. ప్రమోషన్ పై నెల్లూరు జిల్లాకు అడిషనల్ యస్పి(అడ్మిన్) గా విచ్చేశారు.