వెంకటగిరి వైఎస్సార్ సీపీ అస్మతి నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి.. 





 నిన్న నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వర్గం వెంకటగిరి లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ మెట్టుకూరు ధనుజయ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ని లక్ష్యం చేసుకొని మాట్లాడగా దానికి ధీటుగా బుధవారం రాపూరు మండలంలోని తానంచెర్ల చెన్ను గార్డెన్ లో రాపూరు ఎంపీపీ దివంగత నేత చెన్ను బాలక్రిష్ణ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వర్గం చేసిన ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు..పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నేను ఛైర్మన్ గా ఉన్నప్పుడు పెంచలకోన అభివృద్ధి చెందిందని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వల్ల పెంచలకోన లో ఏమి అభివృద్ధి జరగలేదన్నారు..పలువురు వైఎస్సార్ సీపీ అస్మతి నేతలు మాట్లాడుతూ మండలంలో నాయకులుగా పనికి రాని వారు ఈరోజు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని,మెట్టుకూరు ధనుజయ రెడ్డి విమర్శించే ముందు మీరు బతికిన బ్రతుకు ఒక్కసారి ఆలోచించుకోవలన్నారు..పార్టీని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించే మీరా మమ్మలి విమర్శించేదన్నారు.. మీ స్థాయి కి తగ్గట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని హెచ్చరించారు.. చెన్ను వర్గం ఎటు వైపు ఉంటే ఆ వైపే విజయం అన్నారు.. మెట్టుకూరు ధనుజయ రెడ్డి వెంకటగిరి నియోజవర్గంలో వైఎస్సార్ సీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఐదు వేల మెజార్టీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తంచేశారు..