సైదాపురం లో,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు
నెల్లూరు జిల్లా, సైదాపురం మండల కేంద్రంలో,బుధవారం నాడు,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్నిల్ రెడ్డి ఆధ్వర్యంలో,వాహన తనిఖీలు చేపట్టారు.అనుమతి పత్రాలు సరిగాలేని,పలు వాహనాలను, అయన తనిఖీ చేసారు. ఇందులో రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు వాహనాలపై ఆయన కొరడా ఝాలిపించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైదాపురం మండలంలో చాలా వరకు వాహనాలు,నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని, సమాచారం అందటంతో, అటువంటి వాహనాలపై దృష్టి సారించేందుకు గానూ, ఈ రోజు తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే, సరైన అనుమతులు లేకుండా తిరుగుతున్న, సైదాపురం కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును, అలాగే మూడు గూడ్స్ క్యారి వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు,అంతేకాకుండా మరో పది వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వివరించారు.ప్రతి ఒక్క వాహన దారుడు, వారి వాహనానికి సంబందిన పత్రాలు, వారి వద్ద ఉంచుకోవాలని లేని పక్షం లో, అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.