శ్రీ గాయత్రి స్కూల్ లో వసంత పంచమి కార్యక్రమం.




పొదలకూరు మేజర్ న్యూస్

పట్టణంలోని శ్రీ గాయత్రి విద్యామందిర్ లో సోమవారం వసంత పంచమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణమంతా రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో సరస్వతి దేవీకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగా 65 మంది పిల్లలు అడ్మిషన్స్ పొందినట్లు కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. కొత్తగా చేరిన పసి పిల్లలకు వేద పండితులు బీజాక్షరాలు దిద్దించారు. అనంతరం విద్యార్ధులను ఆశీర్వదించారు. సరస్వతీ దేవి కటాక్షంతో విద్యారంగంలో రాణించాలన్నారు. ఈ‌ సందర్భంగా కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ‌ స్కూల్ లో ప్రతి ఏడాది అక్షరాభ్యాస కార్యక్రమం వసంత పంచమి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఎందరో తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఈ పూజలో పాల్గొని సరస్వతి దేవి ఆశీస్సులు పొందుతారన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, ఏడుకొండలు, ఉపాధ్యాయులు, బోధనేతర‌సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.