శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ఆవరణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట : పట్టణంలో కాల్లంగి నదిఒడ్డున వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ఆవరణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మాస్టర్ ప్లాన్ ద్వారా చేయాలనీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం
జరిగింది. ఈ సందర్భముగా జరిగిన విలేకర్ల సమావేశం లో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఆలయ చైర్మన్
దువ్వూరు బాలచంద్ర రెడ్డి వెల్లడించారు.ఆలయం వెనుక ఉన్న ఇరిగేషన్ ,పంచాయతీ రాజ్ ,బీసీ హాస్టల్ స్థలాలను
ఆలయానికి అప్పగించడం జరిగిందని MLA కిలివేటి సంజీవయ్య చొరవతో జిల్లా కలెక్టర్ ఈ నెల 18 వ తేదీన ఈ స్థలాలను ఆలయానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ స్థపతి ప్రముఖుడు అయిన సౌందరరాజన్ చేత
ఆలయ అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ఇక పై దాని ప్రకారమే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఆలయానికి ఇప్పటిదాకా విరాళాలు అందించిన దాతల వివరాలు ఇక్కడ లేవని వాటన్నింటినీ సేకరించి విరాలదాతల
రికార్డును ఏర్పాటు చేయనున్నారు. విరాళాలు ఇచ్చినవారు స్వచ్చందంగా వచ్చి విరాలు తెలియజేయాలని ఆయన
కోరారు. ప్రధాన ఆలయం లోపల ఉన్న శిలాపలకలను తొలగించి ఆలయం బయట మరో చోటుకు మార్చడం జరుగుతుందని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం తో గర్భాలయ గోపురం కు బంగారు తాపడం వేయించడం
జరుగుతుందని కూడా ఆయన తెలియజేసారు.అలాగే కాళంగి నదిలో పుష్కర ఘాట్ ఏర్పాటుచేసి ఆలయం కు
దక్షిణ దిక్కున మరో గాలిగోపురం కాళంగినదికి అనుసంధానంగా నిర్మించనున్నట్లు ప్రస్తుతం కార్యాలయాలు
ఉన్న చోట భజన మండపం నిర్మిస్తున్నట్లు చైర్మన్ తెలియజేసారు. ఈ సమావేశం లో ట్రస్ట్ సభ్యులు ముంగర అమరావతి, కామిరెడ్డి రేవతి , మద్దూరి శారదా, పొన్న నాగమ్మ , కర్లపూడి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.