దుర్గంపై వనభోజనాలు





వైభవంగా జట్ఫట్ బీ బీ గంధమహోత్సవం


ఉదయగిరిమేజర్ న్యూస్.

ఉదయగిరి దుర్గంపై బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. మొహరం మాసంలో వచ్చే చివరి బుదవారం(ఆబర్రాన్యుంబా) రోజున ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు వెళ్లి పచ్చికబయళ్లు తొక్కితే పాపాలు హరించి పుణ్యం లభిస్తుందని వారి విశ్వాసం. అందులో భాగంగా ఉదయగిరి దుర్గంపై పట్టణంతోపాటు వింజమూరు, పామూరు, నెల్లూరు, బద్వేల్, కావలి, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి తొట్టి లొద్ది ప్రాంతంలో సేదతీరి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం దుర్గంపై గల పురాతన కట్టడాలను తిలకించారు. అలాగే దుర్గంపై గల జట్ఫటి బీబీ దర్గాలో గంధమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, పకీరు జరుబులు, బాణసంచా పేలుళ్ల నడుమ గంధాన్ని హక్కుదారుల ఇంటి నుంచి ఊరేగింపుగా దర్గాకు చేర్చారు. చదివింపుల అనంతరం గుడాన్ని భక్తులకు పంచిపెట్టారు. దర్గాలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.