స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలకు చోటు ఇవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఎన్నికలు సజావుగా జరిగేందుకు వా కాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు వ్యూహాత్మక చర్యలు చేపట్టారు, ఈ నెల 9వ తేదీ నుండి  మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ పక్రియను అధికారులు చేపట్టారు, నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐ నరసింహ రావు, బుధవారం వాకాడు సర్కిల్ పరిధిలోని వాకాడు,కోట,చిట్ట మూరు,ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు పక్రయ జరుగుతుంది, ఈ కేంద్రాలు వద్ద సిఐ ఆధ్వర్యంలో ఆయా మండలలా  ఎస్సై లు, పోలీసులు సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు పక్రియ కేంద్రాలు వద్ద ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోలేదు, దీనికి కారణం సిఐ నరసింహ రావు చేపట్టిన ముందుస్తు చర్యలే కారణం, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన అప్పటి నుండి మండల పోలీసు స్టేషన్లు వద్ద వివాదాస్పదమైన గ్రామాలు గుర్తించి ఆయా గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు, రౌడీ షిటర్లను బైండోవర్ చేసుకొని కౌన్సెలింగ్ ఇప్పించారు,  ఈ నేల 21 నుండి జరిగే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్నీ రకాలు చర్యలు చేపట్టారు, గ్రామాల్లో తిరిగే జులయలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తిస్తాం అనీ హెచ్చరికలు జారీచేశారు సిఐ నరసింగరావు, పోలింగ్ కేంద్రాలు పరిశీలన చేసి ఆయా కేంద్రాలు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు,   సి ఐ నరసింహారావు చేస్తున్న సేవలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.