వాడవాడలా కన్నులపండుగగా దబ్బల శ్రీమంత్ రెడ్డి జన్మదిన వేడుకలు




 నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : పేట పురపాలక సంఘం చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం సూళ్లూరుపేట పట్టణ పరిసర ప్రాంతాలలో కనుల పండుగగా అభిమానులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమంత్ రెడ్డి నివాసం వద్ద జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేశారు.  పురవీధులలో శ్రీమంత్ రెడ్డి అభిమానులు బాణసంచా కాల్చి శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా కేకును కట్ చేసి  అందరికీ పంచిపెట్టారు.అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, MPP అల్లూరు అనిల్ రెడ్డి,కళాత్తూరు శేఖర్ రెడ్డి ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో  పురపాలక అధికారులు , పురపాలక కౌన్సలర్లు , మెప్మా అధికారులు , స్థానిక నాయకులు, చెంగాలమ్మ పరమేశ్వరి బోర్డ్ మెంబర్ గోగుల తిరుపాల్ కౌన్సలర్ శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.