అర్బన్ ఎస్పి ఆరిఫ్ హఫీజ్  అసాంఘిక కార్యాకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి గుజరాత్ తరలిస్తున్న పాత గుంటూరు కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశాం. ఒక లీటర్ లిక్విడ్ గంజాయి పట్టుకున్నాం.దీని విలువ మూడు లక్షల రూపాయిలుంటుంది. వైజాగ్ నుండి గుజరాత్ లోని వడోదరకు తరలిస్తున్నారు. రవాణా చేయటానికి సులభంగా ఉండటంతో లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే గంజాయి రవాణా చేస్తున్నారు.