రైతులకు యూనిక్ ఐడీ – ప్రభుత్వ పథకాల కోసం తప్పనిసరి




 వెంకటాచలం, మేజర్ న్యూస్..

కాకుటూరు, చెముడుగుంటలో 

వ్యవసాయ శాఖ "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో రైతుల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ UID) పై అవగాహన కల్పించారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్-లింక్ మొబైల్, పట్టాదారు పాసుబుక్ తీసుకుని రైతు రిజిస్ట్రేషన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.

ఈ UID ద్వారా అన్నదాత సుఖీభవ, రాయితీలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలు లభిస్తాయి. అధికారులు నత్రజని ఎరువుల తగ్గింపు, సుడి దోమ నివారణ కోసం పెక్సలాన్ మందు పిచికారీ చేయాలని సూచించారు.

రైతులు తప్పనిసరిగా e-పంట (e-Panta) పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకోవాలి అని సూచించారు