రవి కిరణాలు న్యూస్ తడ:



సూళ్లూరుపేట రోటరీ క్లబ్ వారు ఈ రోజు అలవల రోటరీ నేత్ర వైద్యశాల లో   ఉచిత మధుమేహ వ్యాధి నిర్దారణ పరీక్షా క్యాంపు ను నిర్వహించారు  ప్రపంచ హృదయ దినోత్సవం ను పురస్కరించుకొని ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది, మధుమేహ వ్యాధి ఉన్నవారికి డాక్టర్ సాయిబాబా మరియు డాక్టర్ మస్తానమ్మ చే అవగాహన కల్పించారు, నిరుపేద ప్రజలు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకున్నారు, ఈ సందర్భముగా రోటరీ డిస్ట్రీక్ట్ 3160  అసిస్టెంట్ గవర్నర్ వేనాటి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు వన్ నేషన్  వన్ డే వన్ మిలియన్ టెస్టులు చేయడం లక్షంగా పెట్టుకుని రోటరీ క్లబ్  ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు, రోటరీ క్లబ్ అధక్షుడు  తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో కార్యదర్శి  వినయ్ కుమార్,ఆదిశేషారెడ్డి, తన్నీరు శేషగిరి రావు,దువ్వూరు సుబ్రహ్మణ్యం రెడ్డి,  కుమార స్వామి,రామకృష్ణ , శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.