ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఇద్దరు దొంగలు

 చిట్టమూరు మండల పరిధిలోని ఆరూరు చెంగాలమ్మ  ఆలయంలో దొంగతనం చేస్తూ యాకసిరి గ్రామానికి చెందిన శేఖర్,వెంకటేశ్వర్లు ఇద్దరు దొంగలు గ్రామస్తులుకు పట్టుబడ్డారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో మల్లాo నుండి శ్రీ సిటీ కి వెళుతున్న బస్సు ఆరూరు మార్గంలో వెళుతుండగా చెంగాలమ్మ గుడి తలుపులు తెరచి ఉండడం గమనిచిన శ్రీసిటీ బస్సులో ఉన్న తాడిమెడు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బస్సును ఆపి చెంగాలమ్మ గుడి లోపలికి వెళ్లి చూడగా గుడికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉండడంతో యువకులు లోపలికి వెళ్లారు అది గమనించిన ఇద్దరు దొంగలు చెంగాలమ్మ గర్భగుడిలో  దాక్కున్నారు గర్భగుడిలోకి ప్రవేశించిన తాడిమేడు యువకులు దొంగలను పట్టుకుని ఆరూరు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకి చేరుకొని రాత్రికి రాత్రే చిట్టమూరు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు దొంగలను పోలీసులకు అప్పగించారు పట్టుబడ్డ దొంగలు ఇద్దరు గతంలో యాకసిరి పీర్లు కావిడలో పీర్లు పాటిమిట్ట గ్రామంలో పోలేతమ్మ ఆలయంలో హుండీ నిన్న మొన్నటి రోజున తాడిమేడు గ్రామం వద్ద మనికట్లమ్మ గుడిలో చోరీ వీరి పనిగానే పలువురు చెబుతున్నారు పగటిపూట వీళ్ళు గ్రామాలలో ప్లాస్టిక్కవర్లు,డబ్బాలు ఏరుకుంటున్నట్లు గ్రామాలలో తిరుగుతూ రాత్రి వేళల్లో ఆలయాలలో ఎవరూ లేని ఇళ్లలో చోరీలు చేస్తున్నారని వీళ్ళని కఠినంగా శిక్షించాలని పలువురు చెప్తున్నారు.