ట్రోల్, డీజిల్ ధరపెలను నియంత్రించాలి
- సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం

అడ్డు అదుపు లేకుండా ప్రతి రోజూ పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్ చార్జీలు, నిత్యావసర సరకుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని సీపీఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినేడు ఇష్టారాజ్యంగా కరెంట్ చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు ఎలాంటి పెంపు లేకుండా చూసి నేడు పెద్ద ఎత్తున ప్రతి రోజూ పెంచుకుంటూ పోతుందన్నారు. నిత్యావసర వస్తువులు రేట్లు కూడా పెరగడంతో పేద ప్రజలు సరిగా తిండి తినలేని పరిస్థితులు వచ్చాయన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్ చార్జీలు, నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటలు చేసి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవూరు కొండయ్య, అంకయ్య, రాజేష్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.