జలదంకి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడకలు...
జలదంకి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడకలు...
ముస్తాబైన చెన్నకేశవ స్వామి ఆలయం...
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జలదంకి గ్రామంలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో, వైసిపి నాయకులు చేవూరు జనార్ధన్ రెడ్డి సూచనలతో వైఎస్సార్ సీపీ మహిళ నేత, మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి ఇందిరాయదుందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేకువజామున 4.గంటల నుండి దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మణక్రాక తిరువెంగళా చార్యులు... వేద మంత్రాలతో పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ని ప్రధాన వీధులలో ఘనంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు..