తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధికి ఘన నివాళులు.
తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధికి ఘన నివాళులు.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ప్లాట్స్ లోనే తన గృహం నందు మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ గ్రంధి యానాదిశెట్టి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ, కావలి పట్టణంలో ఆర్యవైశ్యుల కే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేదుడు వాదోడుగా ఉంటూ ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్అని తెలిపారు. తను కావలి పట్టణంలో రాజకీయంగా ఉన్నంతకాలం కావలి పట్టడానికి ఏదో చేయాలా ఇటు అభివృద్ధిలోనూ తను నిరంతరం కృషి చేసే వారిని అన్నారు . ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రంధి యానాదిశెట్టి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ఆయన రాజకీయ జీవితం ప్రజలకే అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వాసు అధ్యక్షులు తటవర్తి రమేష్,కార్యదర్శి ఓరుగంటి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, చెన్నా కొండలరావు, నందకిషోర్, పేరూరి శంకర్, అచ్యుత శ్రీకాంత్,బలసా ప్రసాద్, సువర్ణ హోమ్ నీడ్స్ శ్రీనివాసులు ఎం. రాజా ఎం. తిరుపాల్ ఆర్యవైశ్య యువ నాయకులు గాదంశెట్టి వంశీ, రమణ సోమిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.