రూరల్ లో వైయస్ఆర్ కు ఘననివాళి
రూరల్ లో వైయస్ఆర్ కు ఘననివాళి
కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైయస్సార్ కు విగ్రహానికి ఘన నివాళులు
ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహణ
కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కాకాని, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి
జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మేకపాటి, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోయల్ల గౌరీ
భారీగా తరలివచ్చిన రూరల్ వైస్సార్సీపీ శ్రేణులు
నెల్లూరు (వైద్యం) మేజర్ న్యూస్
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి ఆదేశాల మేరకు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి సారధ్యంలో నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్నికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అతిథిగా హాజరై దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రూరల్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు , అభిమానులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన అనంతరం జోహార్ జోహార్, వైయస్ఆర్ అమరహే అమరహే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దివంగత వైయస్సార్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను శాశ్వతంగా నిలిపిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. డాక్టర్ వైయస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో దేవుడయ్యాడని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. మహానేత వర్ధంతి కార్యక్రమానికి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రూరల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడి తెలిపారు. అనంతరం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించే కార్యక్రమంలో, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి , జిల్లా మహిళా అధ్యక్షురాలు మోయల్ల గౌరీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బట్టలు పంపిణీ, రక్తదాన శిబిరం సేవా, సర్వమత ప్రార్థనలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, పాశం శ్రీనివాస్, లంక రాం శివారెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, మోయుల్ల సురేష్ రెడ్డి, పాలకీర్తి రవికుమార్, సన్నపురెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఏసునాయుడు, చెన్నారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి, ఉడతా మురళి యాదవ్, కొండా సాయిరెడ్డి, షేక్ బాబు, అయిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చల్లా మస్తాన్ రెడ్డి, శ్రీధర్ నాయుడు, షేక్ నవాబ్ జాన్, సిహెచ్ సూరిబాబు, వరాల లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, స్వర్ణ ప్రసాద్, పాశం తిరుపతి, చంద్రమౌళి, తాడిపత్రి వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, షేక్ జాకీర్, అక్కి చంద్రారెడ్డి, దాసరి రాజేష్, షేక్ ఖలీల్, షేక్ హంషీద్ అలీ, ఏం బాబు, షేక్ కరీం, షేక్ అలీం, రామయ్య, షేక్ రసూల్, బీ ప్రదీప్ కుమార్ రెడ్డి, షేక్ అల్లా బక్షు, పాశం వెంకటేశ్వర్లు, అశోక్ దాస్, అమర్నాథ్, ఖాదర్ మస్తాన్, పఠాన్ అస్లాంఖాన్, మదన్, సాజిద్, మహిళ నాయకులు షేక్ బషీరా, ఎన్ శారద, గుడి కుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.