ఎస్సై గా పదోన్నతి పొందిన డేవిడ్ దాస్ కి సన్మానం

 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న డేవిడ్ దాసుని ఎస్సై గా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఆఫీస్ నుంచి ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న డేవిడ్ దాసుని, మనుబోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్యాల రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు సభ నిర్వహించారు. మనుబోలు ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ, డేవిడ్ దాస్ మనుబోలు పోలీస్ స్టేషన్లో చేసిన సేవలను కొనియాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాది దారులతో, పోలీస్ సిబ్బంది తో ఎంతో హుందాగా వ్యవహరించేవాడని, సున్నిత మనస్తత్వం కలవాడు అని, ఆయన ఎస్సై గా పదోన్నతి పొంది గుంటూరు జిల్లా కి వెళ్తున్న అందుకు సంతోషంగా ఉన్నా, ఒకవైపు స్టేషన్ ను వదిలి వెళ్తున్న అందుకు  బాధగా ఉందన్నారు. ఎందుకంటే ఆయనకు, మాకు ఉన్న అనుబంధం అలాంటిది అని తెలియజేశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి,సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.