నెల్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర తల్పగిరి రంగనాథ స్వామి భక్త బృందాన్ని అభినందించిన దుగ్గిశెట్టి
నెల్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర
తల్పగిరి రంగనాథ స్వామి భక్త బృందాన్ని అభినందించిన దుగ్గిశెట్టి
నెల్లూరు :
నెల్లూరు నగరంలోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుంచి శనివారం తెల్లవారుజామున తల్పగిరి రంగనాథ స్వామి భక్త బృందం తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేపట్టారు. 22 మంది భక్తులు నెల్లూరు నుంచి తిరుమల కు పాదయాత్రగా బయలుదేరారు. వెంకటాచలం సమీపంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పాదయాత్ర బృందాన్ని కలుసుకొని అభినందించారు. వారికి పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న వారి సంకల్పం గొప్పదని, ఆ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలియుగ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు. ఆయన ఆశీస్సులతో అందరూ క్షేమంగా తిరిగి రావాలన్నారు. దారి మధ్యలో ఎలాంటి అవసరం ఉన్నా తాను చూసుకుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు, లోకేష్ , సిసింద్రీ , తదితరులు పాల్గొన్నారు. కాగా, జనసేన నెల్లూరు నగర కార్యదర్శి బుద్ధవాకం బాలు కూడా కాలినడకన తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.