- రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు


స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులను రీజనల్ డైరెక్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కరణం వెంకటేశ్వర్లు సూచించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల నియమావళిని అధికారులకు ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ నిఘా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎన్నికల్లో తమ దృష్టికి వచ్చిన తప్పులను వీడియో, ఫోటోల ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని, అటువంటి నిషిద్ధ కార్యక్రమాలను నిఘా యాప్ ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా ఉత్తర్వులు అందని కారణంగా మిగిలిన 4 మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికలకు అధికారులు సంసిద్ధమవ్వాలని రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.