నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంగ్ల మాధ్యమంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి విద్యా బోధనకు అవసరమైన శిక్షణా తరగతులను మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక జెండావీధి పి.ఎన్.ఎమ్, స్టోన్ హౌస్ పేటలోని ఆర్.ఎస్.ఆర్ పాఠశాలల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శిక్షకులు తరగతులను నిర్వహించి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. శిక్షణా తరగతులకు 90 మంది మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. శిక్షణా కేంద్రాలను నగర పాలక సంస్థ కమిషనర్ 
పివివిస్ మూర్తి పరిశీలించి తరగతుల నిర్వహణను పర్యవేక్షించారు.