ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్.. ఇక ఆందోళనక్కర్లేదు..!
ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్.. ఇక ఆందోళనక్కర్లేదు..!
ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. రోజురోజుకీ కొత్త ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలంగా ఉన్నప్పటికీ.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. గణనీయంగా తక్కువ తీవ్రమైన వ్యాధిగా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన ఈ వేరియంట్ సంబంధిత కేసులపై జరిగిన అధ్యయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సౌతాఫ్రికాలోని ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితులపై అధ్యయన వివరాలను విశ్లేషించారు. వివిధ అధ్యయనాలలోనూ ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని తేలిందన్నారు. అధ్యయనంలో భాగంగా 91 శాతం డెల్టా బాధితులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో 31 శాతం మాత్రమే తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని డేటాలో గుర్తించినట్టు తెలిపారు. డెల్టా రోగులలో 7 రోజులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో ఆసుపత్రిలో చేరే వ్యవధి 3 రోజులకు తగ్గినట్టు అధ్యయన డేటాలో ఉందన్నారు.
డెల్టా బాధితుల్లో 69 శాతం మంది ఆస్పత్రిలో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 41 శాతంగానే ఉందని తెలిపారు. డెల్టా బాధితుల్లో 30 శాతం మంది ఐసియులో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 18 శాతం మంది మాత్రమే ఐసియులో చేరినట్టు డాక్టర్ ఫహీమ్ పేర్కొన్నారు. డెల్టా సోకిన మొత్తం బాధితుల్లో 12 శాతం మంది వెంటిలేటర్‌పై ఉంటే.. ఒమిక్రాన్ బాధితుల్లో1.6 శాతం మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. డెల్టా బాధితుల్లో మరణాల రేటు 29 శాతం నమోదైంది. ఒమిక్రాన్ బాధితుల్లో మరణాల రేటు 3 శాతంగా ఉందన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఒమిక్రాన్‌పై అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని యూనస్ చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా చిన్న వయస్సు వారే ఉన్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ కారణంగా ఈ వయస్సు వారిలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.
డెల్టా, ఒమిక్రాన్ బాధితుల్లో సగటు వయస్సు వరుసగా 36 ఏళ్లు నుంచి 59ఏళ్లు వరకు ఉన్నారని పేర్కొన్నారు. ఒమిక్రాన్ గ్రూపుకు సంబంధించి సీక్వెన్సింగ్ డేటా కూడా ఇంకా అందుబాటులో లేదన్నారు. ప్రపంచంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. అమెరికా, యూరోపియన్ దేశాలు ఒమిక్రాన్ కేసులు అత్యధిక స్థాయిలో పెరుగుతున్నాయి. భారత్‌లోనూ 27,553 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సంఖ్య 1,525కి చేరింది. రాయిటర్స్ డేటా ప్రకారం.. కరోనా కేసులు ఇప్పటికీ 101 దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ కొత్త కరోనా కేసుల్లో అత్యధికంగా అమెరికాలో (3,26,455), యూకే(1,49,513), ఫ్రాన్స్ (1,21,566), స్పెయిన్ (82,391), ఇటలీ (79,716)లోఎక్కువగా ఉండగా.. అమెరికా, రష్యా, పోలాండ్ దేశాల్లో ప్రతిరోజూ అత్యధిక స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయని డేటా సూచిస్తోంది.