నేటి దినపత్రిక సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ.
నేటి దినపత్రిక సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ.
బోగోలు మేజర్ న్యూస్:-
బోగోలు మండల స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నేటి దినపత్రిక సూర్య క్యాలెండర్ ను మండల అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. దేశం రాష్ట్రం నలుమూలల జరిగిన ఘటనలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం మీడియా రంగంకు ఉందని ఆయన పేర్కొన్నారు.నేటి సూర్య దినపత్రిక వాస్తవాలను ప్రజలకు చూపుతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా నిలిచిందని పేర్కొన్నారు. సూర్య దినపత్రిక దినదినాభివృద్ధి చందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లేల్లపలి సుదీర్, ఎర్రం వెంకటేశ్వర్లు రెడ్డి, కోడూరు వెంకటేశ్వర్ రెడ్డి, పుట్టా సుబ్బారావు, మాధవరావు, బోగిరి ప్రభాకర్, గోచిపోతల సంజయ్, సుభాని భాష, ఆవుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.