నేడు ప్రతి ఫిర్యాదు పరిష్కారమే లక్ష్యం. టీడీపీ మండల,పట్టణ అధ్యక్షులు తలచీరు,బొద్దులూరు.
నేడు ప్రతి ఫిర్యాదు పరిష్కారమే లక్ష్యం. టీడీపీ మండల,పట్టణ అధ్యక్షులు తలచీరు,బొద్దులూరు.
పొదలకూరు మేజర్ న్యూస్..
ప్రత్యేక పిర్యాదుల పరిష్కార వేదిక" (స్పెషల్ గ్రీవెన్స్) కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపబోతున్నట్లు టిడిపి మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు అన్నారు. రేపు (బుధవారం) పొదలకూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరగనున్న "ప్రత్యేక పిర్యాదుల పరిష్కార వేదిక" (స్పెషల్ గ్రీవెన్స్) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఎంపీడీఓతో కలిసి మండల,పట్టణ టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు.మస్తాన్ బాబు,పట్టణ అధ్యక్షులు బొద్దులూరు.మల్లిఖార్జున్ నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. అర్జీలు సమర్పించే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో రావాలని విజ్ఞప్తి చేశారు.