విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని శత శాతం విద్యార్థుల నమోదు శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్









రవి కిరణాలు,రేణిగుంట, జూలై 07:-


 రేణిగుంట ఆం.ప్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫారం, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని,విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని శత శాతం విద్యార్థుల నమోదు శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని  ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.


 శుక్రవారం మధ్యాహ్నం  రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఆం.ప్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫారం, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాయని ప్రిన్సిపల్ హరిబాబు తెలుపుతూ 480 మొత్తం విద్యార్థులకు గురుకుల పాఠశాల సామర్థ్యం ఉండగా 430 మంది పాఠశాలలో నమోదు అయ్యారని తెలుపగా కలెక్టర్ అటెండెన్స్ పరిశీలించి మాట్లాడుతూ అబ్సేంటీ విద్యార్థులను తిరిగి పాఠశాలకు పంపేలా, మిగిలిన పాఠశాల సామర్థ్యం నిండేలా నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డెన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు సెలవులో ఉన్నారని వివరించారు. విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏమి టిఫిన్ చేశారని ఆరా తీయగా  పొంగల్ చట్నీ పెట్టారని తెలిపారు. ఎలా చదువు చెప్తున్నారు, ఎలా ఉంది ఆహారం అని, పుస్తకాలు యూనిఫాం ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 7వ తరగతిని పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ యూనిఫాం, షూ  వేసుకోవాలని, కొత్తగా జాయిన్ అయిన వారికి వాటిని, పుస్తకాలను సత్వరమే ఇవ్వాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ పరిశీలించారు. పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్తున్నారా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల నుండి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ కు ఫోన్ లో మాట్లాడి అబ్సెంట్ ఉన్న విద్యార్థులను తిరిగి పాఠశాలకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని, యూనిఫాం, షూ, పుస్తకాలు పంపిణీ చేయాలనీ వారం కల్లా ఇవన్నీ జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.  అనంతరం హాస్టల్ నందు భోజనశాల లోని అన్నం, పప్పు, స్టాక్ వివరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని  సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. 


ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.