తితిదే పాలకమండలి భేటీ..49 అంశాలతో అజెండా..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది… మొత్తంగా 49 అంశాలుతో కూడిన అజెండాను పాలక మండలి సమావేశం కోసం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు… టేబుల్ ఐటెంగా మరి కొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు..




అజెండాలోని అంశాల విషయానికి వస్తే...

2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనుంది టీటీడీ పాలక మండలి

▪️3,171 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ 2022-23 వార్షిక బడ్జెట్‌

▪️1000 కోట్లు హుండీ ద్వారా ఆదాయం అభిస్తుందని అంచనా

▪️రూ.230 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం

▪️గరుడా వారధికి 25 కోట్ల రూపాయల కేటాయింపు

▪️టీటీడీ అమలులోకి రానున్న నూతన పీఆర్సీ విధానం

▪️ప్రభుత్వం జారి చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ క్రింద రూ. 50 కోట్లు చెల్లింపు

▪️చిన్నపిల్లల ఆస్పత్రికి విరాళాల కోసం నూతనంగా అపన్న హృదయ స్కీం ప్రారంభం

▪️శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్దికి రూ. 3.9 కోట్లు కేటాయింపు

▪️తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములును వెనక్కి తీసుకోనున్న టీటీడీ

▪️కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లు పెంపుపై నిర్ణయం..

▪️ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ