తితిదేకి రూ.3 కోట్ల జరిమానా
తితిదేకి రూ.3 కోట్ల జరిమానా
తిరుమల: విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై తితిదే కి ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా వేసిందని ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు..
ఆర్బీఐ వేసిన జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు. తితిదేకు ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ 2018తో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు దానిని రెన్యువల్ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3కోట్ల జరిమానా చెల్లించినందున.. లైసెన్సును రెన్యువల్ చేయాలని ఆర్బీఐకి కోరినట్లు చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు..