స్విమ్స్ వైద్యశాలకు అధునాతన వైద్య పరికరాలు అందజేత కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.

తిరుపతి పట్టణములోని స్విమ్స్ హాస్పిటల్ కు  హెచ్.డి.ఎఫ్.సి మరియు డాక్టర్స్ ఫర్ యు వారు సంయుక్తంగా సుమారు 5 కోట్ల రూపాయల అధునాతన వైద్య పరికరాలను ఉచితంగా అందజేశారు. ఇందులో ముఖ్యంగా 25 డయాలసిస్ మెషీన్స్, 10 వెంటిలేటర్లు , 1 చిన్న పిల్లల వెంటిలేటర్, రెండు ఆల్ట్రాసౌండ్ మిషన్లు మొదలగు పరికరాలని అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టాక వైద్య విధానంలో గ్రామా స్థాయిలో ఉన్న పి.హెచ్.సి నుండి పట్టణాలలోని పెద్ద ఆసుపత్రులతో సహా నాడు నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, అలాగే స్విమ్స్ హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వంలో గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.

స్విమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని మరియు దింవంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో స్విమ్స్ మెడికల్ కాలేజీ నిర్మాణం కొరకు కేటాయించిన 60 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని అందులో వికలాంగులు, వృద్దులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు, అవసరమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలను ఉచితంగా అందజేసిన హెచ్.డి.ఎఫ్.సి మరియు డాక్టర్స్ ఫర్ యు ప్రతినిధులను ఎంపీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే పాలకవర్గ సభ్యులు పోకల అశోక్ కుమార్, తిరుపతి పట్టాన మేయర్ డాII శిరీష, స్విమ్స్ డైరెక్టర్ డాII వెంగమ్మ, హెచ్.డి.ఎఫ్.సి మరియు డాక్టర్స్ ఫర్ యు ప్రతినిధులు పాల్గొన్నారు.