ఎన్ఐపిఇఅర్ (నైపర్) తొలి సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

రవి కిరణాలు న్యూస్:-

 ఢిల్లీలో భారత ప్రభుత్వంలోని రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ మరియు ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఆదర్వంలో ఔషధ శాస్త్రాలలో అధునాతన అధ్యయనాలు, పరిశోధనలకు సంబందించి బుధవారం పలు చర్చలు జరిగాయి. భారతీయ ఔషధ ప్రమాణాలు మెరుగుపరచడమే అజెండాగా జరిగిన ఈ తొలి సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ జాతీయ సంస్థకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కౌన్సిల్ మెంబర్ గా  ఎన్నుకోబడిన విషయం అందరికీ విధితమే.