తిరుపతి ఎస్పీతో భేటీ అయిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి 




రవి కిరణాలు, తిరుపతి:-

తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్థన్ రాజుతో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు నివారించాలని అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని  కోరారు. తిరుపతి పట్టణం ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు నిలయంగా ఉందని ఇటువంటి ప్రాంతంలో గంజాయి, మాదకద్రవ్యాలు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.