సూళ్లూరుపేటలో పర్యటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ రమణారెడ్డి...

ఇళ్లనిర్మాణ పనులను పరిశీలించినా కలక్టర్, వేగవంతంగా ఇళ్ల నిర్మాణపనులను పూర్తిచేయాలి..

*సూళ్లూరుపేట :- సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న  మన్నారు పోలూరు నందు జగనన్న కాలనీ నందు ఇళ్ల నిర్మాణపనులను తిరుపతి జిల్లా కలక్టర్ వెంకటరమణ రెడ్డీ, ఎమ్మెల్యే సంజీవయ్య తో కలిసి పర్యటించారు. మన్నారుపోలూరుకి విచ్చేసిన కలక్టర్, ఎమ్మెల్యే సంజీవయ్య కి మర్యాదపూర్వకంగా శాలువాతో కప్పి స్వాగతం పలికారు మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డీ, చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డీ, కళత్తూరు శేఖర్ రెడ్డీ.

జిల్లా కలక్టర్ పర్యటనలో సూళ్లూరుపేట ఆర్ డి ఓ రోజమండ్, తహసిల్దార్ కె. రవికుమార్, మునిసిపల్ DE, AE, ఉన్నతఅధికారులు, సూళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్స్, మరియు వైస్సార్సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయం నందు కలెక్టర్ డివిజన్ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.