చెంగాళ్ళమ్మ ఆయయంలో చండీయాగం.

అమ్మణ్డీ దర్శించుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి దంపతులు.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

 కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దక్షిణ ముఖ ఖాళీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు  పౌర్ణమి సందర్భంగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో  108 క్షిర కలశము ప్రతిష్టించి పూజలు నిర్వహించి తదుపరి  శ్రీ అమ్మవారికి క్షిరాభిషేకం నిర్వహించి అనంతరం మహాచండియాగం నిర్వహించారు. ఉభయకర్తలుగా సూళ్లూరుపేట చెందిన చెరుకుపల్లి రామ్ కుమార్ శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు  వ్యవహరించారు.

చెంగాళ్ళమ్మ సేవలో జిల్లా కలెక్టర్ దంపతులు..

 శ్రీ అమ్మవారిని  తిరుపతి జిల్లా, కలెక్టర్  కె.వెంకటరమణ రెడ్డి ,IAS కుటుంభ సమేతముగా దర్శించుకొని పూజలు నిర్వహించుట జరిగినది. వారిని చైర్మన్, మరియు కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి ప్రసాదములు అందజేసి వేదపండితులచే ఆశీర్వచనము చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, ఓలేటి బాల సత్యనారాయణ, మన్నెముద్దు పద్మజ, బండి సునీత, పెనుబెటి మారెమ్మ, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ముంగుర అమరావతి, మున్సిపల్ ఛైర్మన్, దబ్బల శ్రీమంత్ రెడ్డి, తహశీల్దార్ కె.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.