సకాలంలో స్పందిస్తే పక్షవాతాన్ని జయించవచ్చు : డాక్టర్ బింధుమీనన్ వెల్లడి







 ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా అపోలో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం


హాస్పిటల్ లో ఉచితంగా వైద్య పరీక్షలు, వైద్య సలహాలు


వైద్య శిభిరంలో పాల్గొన్న డాక్టర్ బింధు మీనన్, డాక్టర్ శ్రీరాం సతీష్


సకాలంలో స్పందిస్తే పక్షవాతాన్ని జయించవచ్చునన్న వైద్యులు

పక్షవాతం సోకినప్పుడు ప్రతీ నిముషం ఎంతో విలువైందని, ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు తీసుకెళ్తే అంత త్వరగా పక్షవాతం నయమవుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బింధు మీనన్, హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్ అన్నారు. ప్రపంచ స్ట్రోక్ డేను పురస్కరించుకుని మంగళవారం అపోలో హాస్పిటల్ లో ఉచిత న్యూరాలజీ వైద్య శిభిరం జరిగింది. ఇందులో భాగంగా పలువురికి ఉచిత పరీక్షలను నిర్వహించారు. అలాగే స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక వేళ స్ట్రోక్ వస్తే ఎంత సమయంలోపు వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి అనే తదితర అంశాలను డాక్టర్ బింధు మీనన్, ఇతర వైద్య బృందం... హాజరైన వారికి తెలియజేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో స్ట్రోక్ కు గురైన రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాలను కూడా వివరించారు. 


ఈ సందర్భంగా అక్కడ జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ బింధు మీనన్, డాక్టర్ శ్రీరాం సతీష్ స్ట్రోక్ ( పక్ష వాతం ) గురించి మాట్లాడారు. పక్షవాతం పెను ఉత్పాతం అని, మెదడులో సునామీగా విరుచుకుపడి, చెట్టంత మనిషిని సైతం కుప్పకూలుస్తుందని హెచ్చరించారు. పక్షవాతం బారిన పడితే శరీరంలో సగ భాగం చచ్చుబడిపోతుందని, కాలు చేయి ఆడదని, నోట మాట రాదని, మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతే ఉండదని పేర్కొన్నారు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తున్న అతి పెద్ద సమస్య పక్షవాతం ( స్ట్రోక్ ) అని తెలియజేశారు. మెదడులో ఉన్నట్టుండి రక్తనాళాలు పూడుకుపోయి, కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోతే ఆ భాగం చచ్చుబడిపోతుందని దాని కారణంగా మనిషి స్ట్రోక్ గు రురౌతాడని వెల్లడించారు. ఆ సమయంలో రోగిని ఎంత త్వరగా వైద్యుని వద్దకు తీసుకెళ్తే అంత త్వరగా పక్షవాతం నయమవుతుందని చెప్పారు. పక్షవాతానికి గురౌనప్పుడు ప్రతీ నిముషం ఎంతో కీలకమైందని, సకాలంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లి వైద్యం అందిస్తే పూర్తిగా కోలుకోవచ్చునని పేర్కొన్నారు.


బీపీ బాగా పెరగడం, ఊపిరి సరిగా తీసుకోకపోవడం, వాంతులు అవుతున్నట్లు ఉండటం... ఇవన్నీ పక్షవాతం రావడానికి ముందు కనిపించే సంకేతాలని వైద్యులు తెలియజేశారు. హై బీపి, దూమపానం, మద్య పానం, హై షుగర్ ఉన్నవాళ్లకు స్ట్రోక్ సంభవించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో స్ట్రోక్ కు అత్యాధునికి వైద్య సేవలతో పాటూ, ఆధునికి వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని, తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటూ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ రష్మీ, డాక్టర్ శివ శంకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.