తిరుపతి జిల్లా.. తిరుమల....

భక్తులు మధ్య జరిగే బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రత

సాధారణ సేవలో 4 వేలమంది.. గరుడ వాహనం రోజున  మరో రెండు వేల మంది

 27న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

చిన్న పిల్లలకు, వృద్ధులకు జియో ట్యాగులు

 కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల పరిరక్షణ.

తిరుమలకు వచ్చే భక్తులతో ఎవరు కూడా అమర్యాదగా ప్రవర్తించి రాదు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సాయం చేయాలి ప్రజలతో ఎక్కడ కూడా అమర్యాదగా ప్రవర్తించరాదు.

భక్తుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే పై అధికారులకు తెలపండి.

అదనపు బలగాలు సిద్ధంగా ఉంది సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు.

తిరుమలకు దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు వారితో అమర్యాదగా ప్రవర్తించరాదు,  మన పోలీసు వ్యవస్థ కి మంచి పేరు తీసుకు రండి మనం అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు వాళ్ల యొక్క రాష్ట్రాలలో మన గురించి చెడుగా ప్రచారం అవుతుంది.

ఏపీ డీజీపీ శ్రీ కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.యస్ గారు...

 కరోనా అనంతరం రెండు సంవత్సరాల తర్వాత భక్తుల మధ్య నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు ఏపీ డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.యస్.,గారు తెలిపారు. సోమవారం తిరుమల లోని నాలుగు మాడవీధుల్లో ను ఆయన పర్యవేక్షించారు. అనంతరం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు.

బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసాము. రెండు సంవత్సరాల అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున దానికి తగినట్లుగా భద్రతా ఏర్పాట్లు చేశాము.  టీటీడీ అనుబంధ ఆలయాలు, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లు, టిటిడి వసతి సముదాయాలతో పాటు, రద్దీ కలిగిన ప్రతి ప్రాంతాలను గుర్తించి, భారీ భద్రత ఏర్పాటు చేసాము.  దొంగతనాలు అరికట్టేందుకు ముందస్తు భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడలి వద్ద దొంగల ఫోటోలను ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసాము.  నిరంతరం అనుమానిత వ్యక్తుల పై నిఘా ఉంచి తమ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారు.

27న సీఎం రాక...  కట్టుదిట్టమైన భద్రత

ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని, అదే విధంగా ఈ నెల 27న( మంగళవారం) సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా సీఎం గారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ఆయన ప్రయాణించే మార్గంలో ఎలాంటి అవకతవకలు చోటు కాకుండా భద్రత చేపట్టాము. తిరుమల తిరుపతిలో పలు ప్రారంభోత్సవాలలో సీఎం గారు పాల్గొంటారు. సుమారు సీఎం గారికి 1500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపట్టాము. తిరుమల లోని అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాని, ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తాము.

రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రెండు ఘాట్ రోడ్లు, తిరుమల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘాట్ రోడ్లు తిరుమల ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు నిరంతరం బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు జరుగుతాయి. ఆక్టోపస్ సిబ్బంది కూడా తిరుమలలో ప్రత్యేక నిఘా తో పని చేస్తారు. అనుమానిత వ్యక్తుల కదలికలు కనపడిన వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు రద్దీ ప్రాంతాలైన ప్రతి ఒక్క చోట తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించాము.


తొక్కిసలాటలో లేకుండా చర్యలు

ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ఆశేష భక్తుల సమూహంలో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించాము.  ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నాము. గరుడ సేవ రోజున టిటిడి నిర్ధేశించిన సమయానికి భక్తులను గ్యాలరీ లోకి అనుమతిస్తాము. తిరుమల మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పోలీసులు వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడైనా రద్దీ పెరిగినా కూడా ఆ ప్రాంతాలను అప్పటికప్పుడే గుర్తించి తగు చర్యలు చేపడతారు.

వాహనాల కొరకు 38 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాట్లు

తిరుమలలో పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాము. తిరుమలలో 38 పాయింట్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశాము. తిరుమలలో పార్కింగ్ ఫుల్ అయిన వెంటనే తిరుపతిలోని జూపార్క్ రోడ్ లో ఉన్న దేవలోక, భారతీయ విద్యా భవన్, హరే రామ హరే కృష్ణ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశాము. ఏ ప్రాంతాల నుంచి టూరిస్టు బస్సులో వచ్చిన వారంతా కూడా దేవలోక పార్కింగ్ లోనే వాహనాలను పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా గరుడ సేవ ముందు రోజైన 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు ఎలాంటి ద్విచక్ర వాహనాలను అనుమతించబడదు. ప్రత్యామ్నాయంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలలో వీళ్ళు పార్కింగ్ చేసుకోవాలి.

జిల్లాకు వచ్చే ప్రతి వాహనం తనిఖీ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని జిల్లా సరిహద్దుల్లో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము. జిల్లాలో వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతాము. ఈ తాత్కాలిక చెక్పోస్టులో నిరంతరం తమ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

నాలుగు వేల మందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రత

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొత్తం నాలుగు వేల మందితో భద్రత నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో మొత్తం 4 వేల మంది విధులు నిర్వహిస్తారు, గరుడ సేవ రోజున మాత్రం మరో రెండు వేల మంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మొత్తం 43 సెక్టార్ గా విభజించి తిరుమల లోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలాగా చేశాము. ఒక్కొక్క సెక్టార్ నందు ఒక డీఎస్పీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేశాము. వారి కింద సీ.ఐ లు, ఎస్.ఐ లు విధులు నిర్వహిస్తూ భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో సమయానికి అనుగుణంగా భద్రత చేపడతారు.


చిన్న పిల్లలకు, వృద్ధులకు జియో ట్యాగులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే చిన్నపిల్లలు, వృద్ధులకు 14 ప్రాంతాలలో జియో ట్యాగ్ లను ఏర్పాటు చేసాము. ఈ జియో ట్యాగ్ ను ప్రతి ఒక్కరూ చేతికి కట్టుకోవాలి, దీని ద్వారా ఏదైనా అనుకోని సమయంలో అదృశ్యమైతే చేతికున్న జియో ట్యాగ్ ద్వారా పూర్తి వివరాలను సేకరించి తిరిగి మీ బంధువుల వద్దకు చేర్చగలము. పోలీసులు కట్టే జియో ట్యాగ్ లతో పాటు తిరుమలకు విచ్చేసే భక్తులు కూడా అప్రమత్తంగా వారి పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి .

మహిళా పోలీసులతో హెల్ప్ డెస్క్ లు

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు మహిళా పోలీసులచే హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశాము. వీరు సమాచారంతోపాటు అవసరమైనవారికి తిరుమలలో కావాల్సిన అన్ని శాఖపరమైన సహాయం అందిస్తారు.

నేర నియంత్రణ పై ప్రత్యేక చర్యలు

శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో నేరాలను నియంత్రించేందుకు 250 మంది ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించాము. ఇప్పటికే తిరుమలలోని 30 ప్రదేశాలలో చైన్ స్నాచింగ్, జిప్ ఓపెనింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ లాంటి నేర ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రాంతాలలో వేలిముద్రలు, వ్యక్తి యొక్క మొహాన్ని గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాము.

జిల్లాలోని క్రైమ్ పాత నేరస్తులను గుర్తించగలిగిన, అవగాహన కలిగిన సిబ్బందిని ఈ బందోబస్తు ఉపయోగిస్తున్నాము.  తెలంగాణ,  కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యారు. వీరంతా కూడా ఆయా ప్రాంతాలలో దొంగలను పట్టె దాంట్లో కీలకంగా వ్యవహరిస్తారు.

దేశం లో పాపులర్ ఫ్రంట్ పై ఎన్.ఐ.ఏ సోదాలు

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) పైన రాష్ట్రంలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అలాంటి సానుభూతిపరులు కార్యకర్తలపై ప్రత్యేక నిఘా ఉంచాము. ఎక్కడ ఇలాంటి వారు ఉన్నా కూడా ముందుగా సిబ్బంది వెంటనే వారి ఆటలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నాము.

క్రైమ్ నేర నియంత్రణకు 400 మంది సిబ్బందితో 3 సెక్టార్లుగా విబజించి ప్రత్యేక చర్యలు
    
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి నగరంలో నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో 3 సెక్టార్లుగా విబజించి (ఆర్.టి.సి బస్ స్టాండ్, అలిపిరి జెనెరల్ సెక్టార్) డి.యస్.పి స్థాయి అధికారిని సెక్టార్ ఇంచార్జి గా నియమించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.

ఇప్పటికే తిరుమలలోని 30 ప్రదేశాలలో చైన్ స్నాచింగ్, జిప్ ఓపెనింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ లాంటి నేర ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రాంతాలలో వేలిముద్రలు, వ్యక్తి యొక్క మొహాన్ని గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. జిల్లాలోని క్రైమ్ పాత, నేరస్తులు గుర్తించగలిగిన అవగాహన కలిగిన సిబ్బందిని ఈ బందోబస్తు ఉపయోగిస్తున్నారు. తెలంగాణ,  కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. లాడ్జీలు, డాబాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్, డార్మెటరీ, మడత మంచాలు అద్దెకిచ్చే ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు.

ఈస్ట్ సెక్టార్

    ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని అనుభంద ఆలయాలకు 378 మంది సిబ్బందితో విధులు.

ఈస్ట్ సబ్ డివిజన్ ను 4 సెక్టార్లుగా విబజించి (తిరుచానూరు, గోవిందరాజుల స్వామీ వారి గుడి, కపిలతీర్థం) డి.యస్.పి స్థాయిఅధికారి పర్యవేక్షణలో శాంతి భద్రతల పర్యవేక్షనతో పాటు శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగినది.

వెస్ట్ సెక్టార్

    వెస్ట్ సబ్ డివిజన్ పరిధిని 2 సెక్టార్లుగా విబజించి (శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు, వకుళమాత ఆలయం, తుమ్మలగుంట ఆలయం) డి.యస్.పి స్థాయిఅధికారి పర్యవేక్షణలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది.

ట్రాఫిక్ సెక్టార్

    ట్రాఫిక్ సబ్ డివిజన్ పరిధిని 8 సెక్టార్లుగా విభజించి 448 మంది పోలీస్ సిబ్బందితో పార్కింగ్ ప్రదేశాలు మరియు ట్రాఫిక్ నియంత్రనకు ఉపయోగించడమైనది. (1.విమానాశ్రయం to గరుడా సర్కిల్ వయా కరకంబాడి, 2.విమానాశ్రయం to రామానుజపల్లి వయా గాజులమండ్యం, 3.రామానుజపల్లి చెక్పోస్ట్ to గరుడా సర్కిల్ వయా వేదిక్ యూనివర్సిటీ, 4.బాలాజీ కాలనీ to గరుడా సర్కిల్ వయా టౌన్ క్లబ్, 5.టౌన్ ఇంటర్నల్ ట్రాఫిక్ పాయింట్స్, 6.నైట్ డ్యూటీ పాయింట్స్, 7.వైట్ కోల్ట్స్ & ఈగల్ మొబైల్, 8.స్టాండ్ బై ఎమెర్జెన్సీ ఫోర్సు)   

ట్రాఫిక్  మళ్ళి౦పులు ఉండు సమయం:  తేది.30.09.2022 మధ్యహ్నం 12 గంటల నుండి తేది.02.10.2022 ఉదయం వరకు  ట్రాఫిక్ మళ్లింపులు ఈ క్రింద విధముగా ఉండనున్నది.
గరుడసేవ యాత్రికులకు తిరుపతి నందుపార్కింగ్ స్థలములు:
1)    దేవలోక్  పార్కింగ్ :- టూరిస్ట్ బుస్సులు మరియు TTD వారు నిర్ణయీంచిన  పరిమితి కి మించిన వాహనాలు టెంపో ట్రావెలర్ , మెట్టడోర్ మొదలైనవి చెర్లోపల్లి నుండి జూ పార్క్ కి సమీపం లో ఉన్న  “దేవలోక్  పార్కింగ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.
2)    భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ :- కార్లు, జీపులు మొదలైన చిన్న  వాహనాలు సైన్స్ సెంటర్ కు ఏదురుగా ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయవలసిఉన్నది.
3)    ద్విచక్ర వాహనాలు కొరకు:- గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్ , ISKON గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్, మెడికల్ కాలేజీ గ్రౌండ్ మరియు మెటర్నటి హాస్పిటల్ కి ఏదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ గౌండ్ లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.

ఈ కార్యక్రమంలో అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీ శ్రీ పి పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు చిత్తూరు ఎస్పీ రి శాంత్ రెడ్డి ఐపీఎస్ గారు మరియు తిరుపతి జేఈవో వీరబ్రహ్మం ఐఏఎస్ గారు టీటీడీ ఎస్ ఓ నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు మరియు  తిరుమల లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు