సమీప భవిష్యత్తులో బొగ్గు కొరత ఉండదు
నెల్లూరు ఎంపీ ఆదాలకు తెలిపిన కేంద్ర మంత్రి
మనదేశంలో సమీప భవిష్యత్తులో బొగ్గు నిల్వలకు కొరత ఉండదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అంతకుముందు, దేశంలోని బొగ్గు నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాల పైన అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లోక్సభలో రాతపూర్వకంగా సమాధానం తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి ఎస్ ఐ )వారి అంచనాల ప్రకారం దేశంలో లో 3,26 ,495 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని ఒక అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1, 607. 21 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని కూడా అంచనా వేసిందని పేర్కొన్నారు. 1950 నుంచి 2018 -19 వరకు వెలికితీసిన బొగ్గు నిల్వలు 15852. 57 మిలియన్ టన్నులని, 2018- 19 లో కోల్ ఇండియా లిమిటెడ్ 730. 35 మిలియన్ టన్ను ల ఉత్పత్తి చేసిందని మంత్రి తెలిపారు 2013 -14 లో 565 .77 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే ,2018- 19 లో అది కాస్త 730 .35 మిలియన్ టన్నులకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో 164.58 మిలియన్ టన్నుల డిమాండ్ పెరిగిందని తెలిపారు. కోల్ ఇండియా లిమిటెడ్ తన ఉత్పత్తిని 58.68 నుంచి 144. 48 మిలియన్ టన్నులకు పెంచిందని పేర్కొన్నారు.