ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీలంకకు పెద్ద తేడా లేకుండా పోయింది...
మూర్ఖత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి..
నందమూరి తారక రామారావు యుగపురుషులు, ఆయన ఒక కులానికో వర్గానికో సంబంధించిన వారు కాదు..
అంతటి మహోన్నత వ్యక్తి పేరు మార్చడం దుర్మార్గం...
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో పేరు మార్చడం లేదు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పేరు మారుస్తున్నారు...
ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీలంకకు పెద్ద తేడా లేకుండా పోయింది...
జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి సొంత చెల్లెలు హర్షించడం లేదు..
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...
వైద్య విశ్వవిద్యాలయానికి నందమూరి తారక రామారావు పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూరల్ నియోజకవర్గం నేతలు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు..
దీక్ష ముగిసిన అనంతరం నాయకులకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ఎందరో యుగ పురుషులు ఉన్నారని, అందులో నందమూరి తారక రామారావు ఒకరని, ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో చెందిన వారు కాదని కొనియాడారు.
ఈ విషయాన్ని, ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ, దీనిని నమ్ముతారని, ఒప్పుకుంటారు అని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరును మార్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఆ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసింది ఎన్టీఆర్ అని ముందు దానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే నామకరణం చేశారని, వైద్య విద్యార్థుల ట్రైనింగ్ విషయంలో, సర్టిఫికెట్స్ ల విషయంలో మాల్ప్రాక్టీసెస్ జరగకుండా, విశ్వవిద్యాలయాన్ని స్వయంప్రతి పత్తి కింద తయారు చేశారని అన్నారు.
ఏదో పెట్టాలని ఆయన పేరు పెట్టలేదని ఆయనను స్మరించుకోవాలని ఆయన చేసిన కృషికి అనుగుణంగా గొప్ప పనులు చేసిన వారి పేర్లను భావితరాలకు గుర్తుండేలా వారి పేర్లను పెడతారని అన్నారు..
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో విశ్వవిద్యాలయానికి పేరు మార్చలేదని, స్పెషల్ ఆలోచనను దృష్టిని దారి మళ్లించడానికి పేరును మార్చారని అన్నారు..
అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు ఉత్తరాంధ్ర మొత్తం పాదయాత్ర చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రం దివాలాస్థితిలో ఉందని శ్రీలంకకు ఆంధ్ర రాష్ట్రానికి తేడా లేకుండా పోయిందని ఈ రెండు అంశాలను దారి మళ్లించడానికి పేరు మార్పును తెరమీదకు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారి పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఎన్టీఆర్ గారి పేరు మార్చి కాదని కొత్త యూనివర్సిటీ దానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు.
ఆ మహా నాయకుడి పేరును తొలగించడం తప్పని స్వయానా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వారి పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హర్షించడం లేదని అయినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మూర్ఖంగా వ్యవహరించే వారే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు..
జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాల్సింది పేరు మార్పుపై కాదని, రాష్ట్రంలో రైతులకు వ్యాపారస్తులకు రాష్ట్ర ప్రజానీకానికి అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు ఉన్న ఎక్కడ కూడా మార్చిన దాఖలాలు లేవని తెలంగాణ ఉద్యమ సమయంలో విగ్రహాలను ధ్వంసం చేస్తే వాటిని తిరిగి నిర్మించారని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం మర్యాదలు పాటించడం లేదని, ముఖ్యమంత్రికి ఉండాల్సిన గౌరవాన్ని కాపాడుకోవాలని, అన్నారు.
నిరాహార దీక్ష చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు తెలిపారని అన్నారు..
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ, దొద్దపనేని రాజా నాయుడు, సాబీర్ ఖాన్, కప్పిర శ్రీనివాసులు, తడకపల్లి సుధా, పెంచల్ నాయుడు, రేవతి, వనజా రెడ్డి, మాతంగి కృష్ణా, డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు, పనబాక భూలక్ష్మీ, కంటే వెంకట సాయి బాబా, ఈదర శ్రీనివాసులు, నన్నే సాహెబ్, కొమరి విజయ, ఉయ్యాల రవీంద్ర, మిర్చి రవి, జగన్ మోహన్, కే. వీ. సుబ్బరాజు, రసూల్, పెంచలయ్య, భాస్కర్, బుజ్జమ్మ, ప్రమీల, సుబ్బన్న, సత్తార్, అశోక్, సాజీద్, మారుతి, నెల్లూరు మురళి, కాపా భాస్కర్, సుబ్రహ్మణ్యం, అంబటి మణికంఠ, బమ్మిడి మణికంఠ, రూపక్, సునీల్, ఇజ్రాయేల్, పద్మావతి, తోటా సునీల్, దారా మళ్ళీ, వల్లెరు బాల సిద్దయ్య, రబ్బానీ, నవీన్, కొండల రావు, మౌనిక, నర్మదా, ప్రభావతి, గురవయ్యా, మునుస్వమి, జేజే నారాయణ, శీవాచారీ, శ్రీనివాసులు, కిషోర్ కుమార్, చెంచయ్య, అనీల్ బాబు, నారా శ్రీనివాసులు నాయుడు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.