ప్రభుత్వము ప్రవేశ పెట్టిన వివిధ పథకములు 100 % ప్రజలకు అందునట్లు తగు చర్యలు
శ్రీమతి ఎం. ధనలక్ష్మి, జిల్లా పంచాయతి అధికారి, నెల్లూరు వారు, తన ఛాంబరు నందు కలిగిరి మండలము విస్తరణాధికారి (పం.రాజ్ మరియు గ్రా.అ.) మరియు మండలములోని అందరు పంచాయతీ కార్యదర్శులతో సమావేశము నిర్వహించినారు. సదరు సమావేశములో గ్రామ పంచాయతీలలో 100 % ఇంటి పన్నులు వసూలు, పారిశుధ్య నిర్వహణ, ఎండాకాలంలో గ్రామములోని ప్రజలు నీటి ఎద్దడికి గురికాకుండునట్లు ముందస్తు చర్యలు చేపట్టవలసినదిగాను మరియు ప్రభుత్వము ప్రవేశ పెట్టిన వివిధ పథకములు 100 % ప్రజలకు అందునట్లు తగు చర్యలు చేపట్టవలసినదిగా తగు సూచనలు, సలహాలు యిచ్చినారు. అటులనే ప్రతి గ్రామ పంచాయతీలో తప్పని సరిగా SWPC షెడ్డు నిర్మాణములు చేపట్టి గ్రామాలను 100% చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు సహకరించవలసినదిగా కోరినారు. ఈ సమావేశములో జిల్లా కో-ఆర్డినేటర్, DPRC శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ యం. సురేష్ బాబు, విస్తరణాధికారి (పం.రాజ్ మరియు గ్రా.అ.) మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.