రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 64శాతం SSC ఉత్తీర్ణత తగ్గడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు
రాష్ట్రంలో ఎస్ ఎస్ సి ఉత్తీర్ణత 64శాతానికి పడిపోవడంతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారు ఎంతో మంది ప్రజలను విద్యావంతులను చేసిన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు రాలు సావిత్రి బాయి పూలే మరియు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహలకు మాలలు వేసి నివాళులు అర్పించి మీడియాతో సమావేశమయ్యారు...సమావేశంలోని ముఖ్యాంశాలు
📎వైసీపీ అవగాహన లేని పాలన వలన అని వర్గాలు నష్టపోయారు ఇపుడు పిల్లల భవిష్యత్తు పాడుఅవుతుంది
📎 నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపిన జగన్ ప్రభుత్వం రంగులు వేయడానికి తప్పిస్తే మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైంది.
📎మార్కుల విషయంలో కూడా అనేక అవకతవకలు స్పష్టంగా కనబడుతుంది.
📎నిర్వహణ లోపం కారణంగా రాష్ట్రాన్ని అజ్ఞానంలో ముంచెత్తుతున్నారు జగన్ గారు ....
📎జగన్ ఉచితంగా ఇచ్చే స్కూలు బ్యాగులు నాణ్యతా లోపం తో పది రోజులకే చిరిగి పోతున్నాయు..
📎విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను బ్రాందీ షాప్ అమ్మకందారు,క్యూల కంట్రోలుకు  కూడా వాడిన మన ప్రభుత్వం వారి మనోభావాలను దెబ్బ తీసింది ఈ వై సి పి ప్రభుత్వం..
📎స్కూల్ బ్యాగులు బెల్టుల మీద ఫోటోలు వేసుకోవడానికి చూపిన శ్రద్ధ పిల్లలకు చదువు చెప్పే నిర్వహణ విషయం లేకపోయింది...
📎 అమ్మ ఒడి పథకం లో మరుగుదొడ్ల నిర్వహణ పేరు తో  ₹1000 రూపాయలు వసూలు భాద్యత టీచర్ల పై వేసి వారి సమయాన్ని వృధా చేసింది.
📎రెండు లక్షల మంది ఫెయిల్ అయితే వారందరికీ విద్యాదీవెన సంవత్సరం పాటు మిగులుద్ది అనే ఆలోచన తో ఉత్తీర్ణత తగ్గించినట్లున్నారు...
                     ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారి తో పాటు ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్,జనసేన రాష్ట్ర సెక్రటరీ కొట్టే వెంకటేశ్వర్లు,ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నళిసెట్టి శ్రీధర్,జిల్లా సెక్రెటరీ ప్రశాంత్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి సుధీర్ కలువాయి తో పాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు...