రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం మూడో రోజు చిట్టమూరు మండలం లోని చిట్టమూరు గ్రామంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించి, మండల ప్రజలు,కార్యకర్తలతో మరియు నాయకులతో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జ్యోతి రావు పూలే ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాల వేసినివాళులర్పించి, జాతీయ జెండా ఎగరేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతోమాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూఏ గ్రామానికి వెళ్లినా మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మరువలేరు అని, అంతేకాకుండా ఈ తొమ్మిది మాసాలు జరిగినటువంటి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పెన్షన్లు అన్న క్యాంటీన్ సంక్రాంతి కానుక రంజాన్ తోఫా ఈ సంక్షేమ కార్యక్రమాలను ఎత్తివేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిట్టమూరు కొత్తగుంట సిమెంట్ రోడ్లు,ఉపాధి పథకాలకు మరియు పంచాయతీ భవనాలకు అయినటువంటి ఖర్చు రూ. నాలుగు కోట్ల 80 లక్షలు  రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని అన్నారు. చిట్టమూరు పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు 3 సెంట్లు కేటాయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఒకటిన్నర సెంటు స్థలంలో ఏమి ఇల్లు కట్టాలని అన్నారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ మండల పార్టీ నాయకులు కలిసి తాసిల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన రేషన్ కార్డులను పునఃపరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని గతంలో నిరుపేదలకు ఇచ్చిన తెనాలి భూములను స్వాధీనం చేసుకుని తిరిగి ఇళ్లకు కేటాయించడం దారుణమని వాటిని తిరిగి నిరుపేదలకు కేటాయించి విధానం చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ కన్వీనర్ కిషోర్ నాయుడు, మస్తాన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కుమార్ రెడ్డి, ఎర్రబోతు సుబ్రహ్మణ్యం, బాబు నాయుడు, మోహన్ నాయుడు కార్యకర్తలు ఎస్కే బషీర్, సురేష్ మురళి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.