పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న దేవాలయంలో  చోరీకి పాల్పడిన దుండగులు 


రవికిరణాలు: ఓజిలి-ప్రతినిధి: ఓజిలి మండల పోలీస్ స్టేషన్ కు ముప్పై మీటర్లు దూరంలో ఉన్న దేవాలయంలో దొంగతనం జరిగింది. ఓజిలి గ్రామదేవత నాగర్పమ్మ దేవాలయంలో గురువారం రాత్రి దొంగలు చొరపడ్డారు.

దేవాలయంలో ఉన్న హుండీ ని పగులకొట్టి అందులో ఉన్న నగదును,అమ్మవారి మెడలోని నగలును దోచుకొనిపోయారు . శుక్రవారం ఉదయం పూజారి పూజ కార్యక్రమాలకు సిద్ధమై ఆలయం తలుపులు తెరవగా  చోరీ జరిగిన విషయాన్ని పసిగట్టిన పూజారి సమాచారంను గ్రామస్తులకును, స్థానిక పోలీసులకు తెలియపరిచారు . దొంగతనం జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్ కు ముప్పై మీటర్ల దూరంలో ఉండడం గమనించ దగ్గ విషయం.దేవాలయం లో సిసి కెమెరాలు ఉండడంతో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను సీసీ ఫోటోస్ సహాయంతో సులువుగా దొంగలను పట్టుకోవచ్చు అని గ్రామస్తులు పోలీసులు వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.