పొలాల్లో ఉన్న రైతును దారుణంగా కొట్టి హింసించే హక్కు పొదలకూరు ఎస్సై కరిముల్లాకు ఎవరిచ్చారు
పొలాల్లో ఉన్న రైతును దారుణంగా కొట్టి హింసించే హక్కు పొదలకూరు ఎస్సై కరిముల్లాకు ఎవరిచ్చారు
పశువులు కూడా సాటి పశువుని ఇంత హింసకు గురిచేయవు
అమాయకులను నోటికొచ్చిన బూతులు తిట్టే పోలీసులకు తల్లులు, అక్కాచెళ్లెల్లు, భార్యాపిల్లలు లేరా
ప్రజలు కట్టేపన్నులతో జీతాలు తీసుకుంటూ తిరిగి వారినే హింసించడం దుర్మార్గం
వైసీపీ ఎమ్మెల్యేలకు జీతగాళ్లుగా మారి ప్రజలకు నరకం చూపిస్తారా..ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుంచుకోండి
ఎస్సై కరిముల్లా అరాచకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి సోమిరెడ్డి
పొదలకూరు ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ మునీంద్ర కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడి నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తాటిపర్తికి చెందిన రైతు పాలగిరి శ్రీనివాసులు రెడ్డిని పరామర్శించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి సురేంద్ర, జెన్ని రమణయ్య, రైతు నాయకులు రావూరు రాధాక్రిష్ణమనాయుడు, కడగండ్ల మధుబాబు నాయుడు, రాపూరు సుందరరామిరెడ్డి, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, డాక్టర్ శ్రీపతి బాబు తదితరులు
పాలగిరి శ్రీనివాసులురెడ్డి పరిస్థితిని చలించిపోయిన నాయకులు..ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని అరాచకంగా వ్యవహరించిన పోలీసులపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయం
1990లో అత్తమామలు కొనుగోలు చేసిన భూమి తమ అనుభవంలో ఉందని, ప్రతి సారి పంట చేతికొచ్చే సమయానికి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మాతో గొడవ పెట్టుకుంటాడని, కత్తులతో దౌర్జన్యం చేస్తాడని, చంపడానికి వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీనివాసులురెడ్డి సతీమణి..రాత్రి కూడా పొలంలో ఉన్న తన భర్తను ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ మునీంద్ర దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారని బోరుమన్న బాధితురాలు జిల్లాలో కొందరు ఎస్సైలు అతిగా వ్యవహరిస్తున్నారు..పొదలకూరు, మనుబోలు, క్రిష్ణపట్నం ఎస్సైలతో పాటు జిల్లాలో మరికొందరు శృతిమించిపోతున్నారు ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ కేసులు, హత్యాయత్నాలు, అత్యాచార యత్నాల పేరుతో కేసులు నమోదు చేయడం, భౌతికదాడులతో హింసించడం పరిపాటిగా మారిపోయింది పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన రైతు పాలగిరి శ్రీనివాసులు రెడ్డిని ఎస్సై కరిముల్లా దారుణంగా హింసించాడు
30 ఏళ్లుగా అన్ని హక్కులతో కూడిన శ్రీనివాసులు రెడ్డి సాగు చేసుకుంటున్న భూమి విషయంలో వైసీపీ నాయకుడు ఒకరు వివాదం సృష్టిస్తున్నాడు ఈ వివాదం విషయంలో జాయింట్ కలెక్టర్ కోర్టులోనూ పాలగిరి శ్రీనివాసులురెడ్డికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి అయినా ఆ వైసీపీ నాయకుడి ఆదేశాలతో ఎస్సై కరిముల్లా పొలంలో వరికోత కోసుకుంటున్న శ్రీనివాసులు రెడ్డిని స్టేషన్ కు రావాలని బెదిరిస్తాడు పొలంలోనే వడ్ల రాశివద్ద ఉన్న శ్రీనివాసులురెడ్డి వద్దకు ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ మునీంద్ర వచ్చి దారుణంగా చావగొట్టారు ఎస్సై కరిముల్లా, కానిస్టేబుల్ మునీంద్ర ఇద్దరూ విచక్షణరహితంగా కొట్టడంతో శ్రీనివాసులురెడ్డి తీవ్రంగా గాయపడ్డారు ఇటీవలే అన్నవాహికకు సంబంధించి చికిత్స చేయించుకున్న ఆ రైతును గుండెల మీద, పొట్టమీద చావబాదారు అసలు ఈ వివాదంతో ఎస్సై కరిముల్లాకు ఏం సంబంధం..ఎమ్మెల్యే చెబితే పొలాల్లోకి వచ్చి రైతులను ఇష్టారాజ్యంగా కొట్టేస్తారా స్సై కరిముల్లా అరాచకాలకు అంతే లేదా..మొన్న భార్యతో కలిసి బంధువుల ఇంటికి బైక్ పై వెళుతున్న పొదలకూరు మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు నడిరోడ్డుపై ఆపి దుర్మార్గంగా వ్యవహరించాడు...ఇప్పుడు రైతు శ్రీనివాసులు రెడ్డి గొడ్డును బాదినట్టు బాదాడు నల్లపాళెంలో 16 మంది బీసీ యువరైతులు సాగుచేసుకుంటున్న సంపంగి తోటలను నాశనం చేశాడు పొలంలో ధాన్యం రాసి వద్ద ఉన్న రైతు శ్రీనివాసులు రెడ్డిని చొక్కా పట్టుకుని లాగి తన్నుకుంటూ తీసుకెళ్లారంటే అసలు మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు
భూవివాదం ఉంటే సివిల్ వ్యాజ్యం వేసుకోవాలి కానీ శ్రీనివాసులురెడ్డి అమానుషంగా కొట్టడానికి ఎస్సై కరిముల్లా ఎవరు..అసలు సివిల్ వివాదంతో ఆయనకు ఏమి సంబంధం వెనుక నుంచి ఒకరు, ముందు నుంచి ఒక్కరు తన్నుతూ తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకుంటారా ప్రతి సారి ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పాలగిరి శీనారెడ్డి కోర్టు స్టే కూడా తెచ్చుకునివున్నారు తల్లులు, భార్యలను తిట్టడానికి, ఇష్టమొచ్చినట్టు కొట్టడానికి పోలీసులకు ఏమైనా ఈ ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చిందా ఈ ఘటన జరిగిన వెంటనే విషయం తెలిసి నేను సీఐ, డీఎస్పీ, ఎస్పీలకు ఫోన్ చేస్తే స్పందించరా ప్రజల సొత్తును జీతాలుగా తీసుకునే మీరు తిరిగి వారినే హింసిస్తారా వైసీపీ ఎమ్మెల్యేలకు జీతగాళ్లుగా మారి ప్రజలకు నరకం చూపిస్తారా నెల్లూరు జిల్లాలో కొందరు పోలీసుల అరాచకాలతో పరిస్థితి చేయిదాటిపోతోంది. వారిపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తగు చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లా ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని కోరుతున్నా