పొదలకూరు మండలం నేదురుపల్లి పంచాయితీ లో పల్లె బాట కార్యక్రమం చేపట్టిన మాజీమంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.  కనీసం పది శాతం కూడా రైతులకు యూరియా పంపిణీ చేయని ప్రభుత్వం .   3వేల బస్తాలకు 330 అందించామని అధికార పార్టీ నాయకులతో పాటు మీడియా ప్రతినిధులు, రైతుల ముందు అంగీకరించిన నేదురుపల్లి సర్పంచ్ రమేష్.  ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోమిరెడ్డి వద్ద గగ్గోలు పెట్టిన రైతులు   రైతుల పై మీకెందుకు ఇంత కక్ష ..   ప్రభుత్వాన్ని  ప్రశ్నించిన సోమిరెడ్డి  తమ కష్టాలను సోమిరెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన స్థానిక రైతులు. పంటల సాగుకు అవసరమైన యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమిరెడ్డి వద్ద వాపోయిన అన్నదాతలు.  రైతులతో కలిసి రైతు భరోసా కేంద్రానికి వెళ్లిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా యూరియా  పంపిణీ పై సర్పంచ్ ని అడిగి వివరాలు సేకరించిన సోమిరెడ్డి.

ఇప్పటి వరకు 330 బస్తాలు యూరియా మాత్రమే పంపిణీ చేయగలిగామని స్థానిక రైతులు,వైసిపి నాయకులు,మీడియా ప్రతినిధుల సమక్షంలో సోమిరెడ్డికి తెలిపిన సర్పంచ్.

దాదాపు 3000 బస్తాలకు పైగా యూరియా రైతులకు అవసరమైతే 330 బస్తాలు అందించడం ఏమిటంటూ ప్రశ్నించిన సోమిరెడ్డి.  పంటల సాగుకు కనీసం 50 శాతం ఎరువులు రైతులకు అందించలేకపోవడం దారుణం. నేదురుపల్లి పంచాయితీలో వెయ్యి ఎకరాల ఆయకట్టుకు 330 బస్తాల యూరియా అందించారంటే వైసిపి ప్రభుత్వం రైతులకు ఏమాత్రం అండగా నిలబడుతుందో అర్థమవుతోంది. పంటల సాగు ప్రారంభం నుంచి సకాలంలో యూరియా వినియోంచకుంటే రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రచారంలో ఎమ్మెల్యే కాకాని మాత్రం ఎరువులు కొరత లేకుండా రైతులకు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాడు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పంటలు చేతికి వస్తే గిట్టుబాటు ధర ఉండదు, ప్రభుత్వానికి ధాన్యం అమ్మేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మేము పుట్టిన నాటి నుంచి  పుట్టి ధాన్యం అంటే 850 కేజీలు మాత్రమే.. కానీ ఇప్పుడు పుట్టి కి  1100 కేజీలు  సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమైపోతుందో అర్థం కావడం లేదు... ఎందుకు వైసిపి ప్రభుత్వం ఇంత కక్ష సాధింపులకు పాల్పడుతోంది. వినుకొండలో ఒక వైసీపీ నాయకుడే తమకు సకాలంలో ప్రభుత్వం తమ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కు నగదు జమ చేయటం లేదని విన్నవించాడు... అతనిపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు.

తంబళ్లపల్లి లోనూ సమస్యలను తెలియజేసిన వైసీపీ జడ్పిటిసి భర్త కొండ్రెడ్డిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం  కాక బయటికొచ్చిన అక్రమ కేసులు బనాయిస్తున్నారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షం పైనే కాకుండా తమ పార్టీ నేతలపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు  సర్వేపల్లి నియోజకవర్గంలో రీచ్ లు లేకపోయినా  వైసిపి నాయకులు అమ్ముకునేందుకు  విరుఊరు నుంచి పిడతాపోలురు వరకు దొరుకుతుంది. గ్రావెల్ కావాలంటే  కసుమూరు, రామదాసు కండ్రిగ నుంచి ఇష్టం వచ్చినట్లు రాత్రి,పగలు దొరుకుతుంది కానీ రైతులకు మాత్రం అవసరమైన యూరియా ఉండదు... గిట్టుబాటు ధర అసలే ఉండదు. ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

టిపిపి హయాంలో 20కి20 ...900 ఇప్పుడు 1350,పొటాషియం 850 ఉంటే ఇపుడు 1750, సల్పేట్ 700ఉంటే ఇప్పుడు 1500,ఇలా అన్ని ధరలు పెంచేందు సిగ్గులేదా...

నెల్లూరు జిల్లాలో ఎక్కువ డెల్టా ఉన్న ప్రాంతం కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కాని దుస్థితి. టిడిపి హయాంలో యూరియా కొరత ఏర్పడితే కృష్ణపట్నం నుంచి రేక్స్ నుంచి తెప్పించి అధిక మొత్తంలో డంప్ చేయించాం. ఏ గ్రామానికి కావాలంటే ఆ గ్రామానికి... ఏ సొసైటీ కి కావాలంటే ఆ సొసైటీకి యూరియా వేల బస్తాలు తరలించి సకాలంలో రైతులకు అందించాం. సమస్యలు వచ్చినప్పుడే ఎమ్మెల్యేల సత్తా తెలిసేది. మీకు సత్తా ఉంటే రెండు మూడు రోజుల్లో రైతులకు యూరియా అందించండి.లేకుంటే ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకోండి. నాట్లు వేసిన దగ్గర్నుంచి పంట పండించి అమ్ముకునే అంతవరకు రైతులను ఇబ్బందులకు గురి చేయటం దుర్మార్గం.. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తడం దారుణం. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామ పర్యటనలు మొదలుపెట్టాం... ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.