నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైనుకు పెండింగ్ భూసేకరణ పనుల పురోగతి వేగవంతం

జిల్లా కలెక్టర్ డాక్టర్. జి. లక్ష్మీ శ

రవి కిరణాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి:-



రైల్వే మరియు జాతీయ రహదారుల కు సంబంధించిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ, బడ్జెట్ విడుదల పలు అంశాలపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజి, న్యూఢిల్లీ నుండి కేంద్ర అధికారులు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు కలెక్టర్లు, జేసీలు, జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రవాణా, రహదారులు భవనాల శాఖ సెక్రెటరీ ప్రద్యుమ్న హాజరవగా తిరుపతి జిల్లా నుండి కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న సుమారు 182 ఎకరాల డికేటి భూములకు సంబంధించిన అవార్డు పాసింగ్ రానున్న జూన్ నెల వరకు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై సమీక్షించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టరేట్ సిబ్బంది,భూ సేకరణ  డిటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.