కందుకూరు పట్టణం సుందరయ్య నగర్ నందు ఉన్న సమస్యలు పరిష్కరించాలి
కందుకూరు పట్టణం సుందరయ్య నగర్ నందు ఉన్న సమస్యలు పరిష్కరించాలి
కందుకూరు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కందుకూరు పట్టణం ఆరో వార్డు సుందరయ్య నగర్ నందు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కందుకూరు మున్సిపల్ కమిషనర్ గారితో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ఏ గౌస్ మాట్లాడుతూ కందుకూరు పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం కోసం ఆరోజు అక్కడ నివాసం ఉంటున్న పేదల ఇల్లు తొలగించి పక్కనే ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది రామతీర్థం నుండి కందుకూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు పైప్లైన్ ద్వారా మంచినీటి వసతి కల్పించారు సమ్మర్ స్టోరేజీ ఆనుకొని పక్కనే ఉన్న సుందరయ్య నగర్ లింబిని వనానికి మంచినీళ్ల పైప్ లైన్ గాని కొళాయి కనెక్షన్ గాని కల్పించలేదు సమ్మర్ స్టోరేజీ నిర్మాణం కోసం నివాసం ఉంటున్న ఇళ్లను తొలగించి పక్కనే ఇల్లు నిర్మించుకోమని స్థలం చూపించారు ఆ సందర్భంలో ప్రజా ప్రతినిధులు అధికారులు మాట్లాడుతూ సుందరయ్య నగర్ కాలనీ మోడరన్ కాలనీ చేస్తాము అని అన్నారుఆచరణలో ఇప్పటివరకు మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా చాలీచాలని నీళ్లు పంపిస్తున్నారు తప్ప శాశ్విత పరిష్కారం చేయటం లేదని అన్నారు వీటితోపాటు పారిశుద్ధ్య సమస్య అనేక సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు మాట్లాడుతూ తక్షణమే మంచినీటి పైప్ లైన్ నిర్మాణం చేపడతామని తెలియజేశారు మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పట్టణ కమిటీ ధన్యవాదాలు తెలియజేసినది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి వెంకట్రావు ఎస్.కె మల్లిక ఎం పద్మ ఏం రాయుడు పాల్గొన్నారు