చెంగాళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ దంపతులు.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తన 35వ జన్మదినం సందర్భంగా ఆదివారం సూళ్లూరుపేటలోని కాల్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తులకు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణముఖ కాళీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు.
శ్రీమంత్ రెడ్డి ఆయన సతీమణి హారిక రెడ్డి ముందుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించారు, అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండల సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, ఓలేటి బాల సత్యనారాయణ, వంక దినేష్ తదితరులు పాల్గొన్నారు.