పేదవారి ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం...

పవిత్ర రంజాన్ మాసంలో అందరూ పేదవారికి వీలైనంత సహాయపడండి...

టిడిపి హయాంలో మసీదు మరమ్మతులకు నిధులు కేటాయించేవాళ్ళం...

నేటి వైకాపా ప్రభుత్వం వాటిని విస్మరించింది...

ప్రభుత్వం సహాయం చేయనంత మాత్రాన దేవుడి కార్యం ఆగదు...

ప్రభుత్వాలు ముందుకు వచ్చి పెద్ద మనసుతో నిధులు కేటాయించడం మానవత్వం....

- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33 వ డివిజన్ నేతాజీ నగర్ లో గల ఖూబా మస్జిద్ లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు...

ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ. దృఢసంకల్పంతో ప్రార్థించే ప్రతి ఒక్కరి సమస్యలను అల్లాహ్ తీరుస్తాడని, మనం చేసే కార్యాలను బట్టి కూడా మనకు ఫలితాన్ని ఆ దేవుడు అందిస్తారని తెలిపారు. ధ్రువ సంకల్పంతో పనిచేసి, ఫలితాన్ని దేవుడి చేతిలో పెట్టి మనం చేయాల్సిన కృషి చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు. పేదవారి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ పేదవారికి వీలైనంత సహాయ పడాలని సూచించారు. మనం ఎంత సంపాదించినా చివరికి ఒట్టి చేతులతో వెళ్లాలని, ఉన్నన్ని రోజులు సమాజానికి కుటుంబానికి దేశానికి పనికొచ్చే విధంగా జీవించాలని తెలిపారు. గతంలో టిడిపి హయాంలో మసీదు మరమ్మతులకు నిధులు కేటాయించే వారిమని నేటి వైకాపా ప్రభుత్వం వాటిని విస్మరించిందని విమర్శించారు. మీరు మరమ్మతులకు నిధులు ఇవ్వడం అంత మాత్రాన దేవుడి కార్యం ఆగిపోదని కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చి సహాయం చేయడం మానవత్వం అని తెలిపారు. ప్రభుత్వాలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి మసీదు మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పై కార్యక్రమంలో సాబీర్ ఖాన్, పెంచల నాయుడు, బాబు, అస్లాం, అస్లాం, మాజీద్ తదితరులు పాల్గొన్నారు...