ఆదర్శప్రాయుడు స్వామి వివేకానందుడు
నెల్లూరు, జనవరి 11, (రవికిరణాలు) : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ నందు స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఆర్.సుదర్శన్ రావు మాట్లాడుతూ ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది, లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. మిమ్మల్ని బలవంతుల్ని చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. యువత తలుచుకోవాలే గాని అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరు. ఇది చరిత్ర చెప్పిన నగ్నసత్యం అని ప్రబోధించిన స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమసేవలు కనబరిచిన యువజన సంఘాలకు ఇచ్చే బెస్ట్ యూత్ క్లబ్ అవార్డు 2019 ను పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కు దక్కింది. ఈ అవార్డును అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ రాజుకు 25,000 చెక్కు మొమెంటో, ప్రశంసాపత్రం, శాలువాతో.. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఆర్ సుదర్శన రావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి.ఆజయ్ రిగినాల్డ్. విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్శంకర్, నెహ్రూ
యువకేంద్ర డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి, సెట్నెల్ సూపరింటిండెంట్ గయాజ్ మహమ్మద్, రామకృష్ణ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సాయికుమార్ రెడ్డి, నారాయణ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యువకేంద్ర డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆకుల మహేందర్రెడ్డి, సెట్నెల్ సూపరింటిండెంట్ గయాజ్ మహమ్మద్, రామకృష్ణ సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సాయికుమార్ రెడ్డి, నారాయణ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.